రష్యా అధ్యక్షుడు పుతిన్ కూడా మోదీకి ఫోన్ చేశారు!
- పలు అంతర్జాతీయ అంశాలపై చర్చ
- ఈస్ట్రన్ ఎకనామిక్ సదస్సుకు రావాలని మోదీకి ఆహ్వానం
- సానుకూలంగా స్పందించిన భారత ప్రధాని
ఐక్యరాజ్యసమితి, బ్రిక్స్ వంటి ప్రపంచ వేదికలపై పరస్పర సహకారాన్ని కొనసాగించాలని ఇరు దేశాధినేతలూ నిర్ణయించారని వెల్లడించింది. రష్యాలో సెప్టెంబర్ లో జరగనున్న ఈస్ట్రన్ ఎకనామిక్ ఫోరమ్ సదస్సుకు హాజరు కావాలని కోరేందుకు పుతిన్ ఫోన్ చేసినట్టు తెలుస్తోంది. సదస్సుకు హాజరుకావాలన్న పుతిన్ విజ్ఞప్తిపై నరేంద్ర మోదీ సానుకూలంగా స్పందించారని విదేశాంగ శాఖ అధికారి ఒకరు పేర్కొన్నారు.