Chandrababu: వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు-పవన్ కలిసి పోటీ చేస్తే సంతోషిస్తా: వైఎస్ జగన్

  • గతంలో కలిసి పోటీ చేశారు..ప్రజలను మోసం చేశారు
  • ఇప్పుడేమో, వీళ్లిద్దరూ విడిపోయినట్టుగా నటిస్తున్నారు
  • ముసుగు తీసేసి మళ్లీ వాళ్లిద్దరూ ఒక్కటయ్యే పరిస్థితి
ఏపీలో వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు-పవన్ కలిసి పోటీ చేస్తే తాను సంతోషిస్తానని వైసీపీ అధినేత జగన్ సెటైర్లు విసిరారు. ‘టీవీ 9’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ‘చంద్రబాబు-పవన్ కలుస్తానంటే జగన్ కు ఎందుకంత బాధ అని ఇటీవలే బాబు వ్యాఖ్యానించిన విషయాన్ని ప్రస్తావించారు. గతంలో కూడా వీళ్లిద్దరూ కలిసి పోటీ చేసి ప్రజలను మోసం చేశారని, ఇప్పుడేమో, వీళ్లిద్దరూ విడిపోయినట్టుగా నటించి మోసం చేసే కార్యక్రమాలు జరుగుతున్నాయని ఆరోపించారు. ప్రస్తుతం ఆ నటన కూడా పక్కనపెట్టేసి, ముసుగు తీసేసి మళ్లీ వాళ్లిద్దరూ ఒక్కటయ్యే పరిస్థితులున్నట్టు చంద్రబాబు మాటల ద్వారా అర్థమవుతోందని అన్నారు. ఏం జరిగినా కానీ, తనకైతే భయం, బాధ లేదని, చంద్రబాబు-పవన్ కలిసి పోటీ చేస్తే ఇంకా సంతోషపడతానని అన్నారు.   
Chandrababu
ys jagan
Pawan Kalyan
Telugudesam
YSRCP
jana sena

More Telugu News