Chandrababu: చంద్రబాబుపై నిప్పులు చెరిగిన మోదీ.. లోకేశ్ కోసం రాష్ట్ర భవిష్యత్తును నాశనం చేస్తున్నారన్న ప్రధాని

  • కార్యకర్తలతో మోదీ వీడియో కాన్ఫరెన్స్
  • కుమారుడి కోసం రాష్ట్ర భవిష్యత్తును పణంగా పెట్టారు
  • ఎన్టీఆర్‌కు ఇది రెండో వెన్నుపోటు
ప్రధాని నరేంద్రమోదీ ఆదివారం అనంతపురం, కర్నూలు, కడప, తిరుపతి, నరసరావుపేట పార్లమెంటు నియోజకవర్గాలకు చెందిన బూత్ స్థాయి కార్యకర్తలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. త్వరలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుపై మరోమారు నిప్పులు చెరిగారు. కుమారుడు లోకేశ్ భవిష్యత్తు కోసం రాష్ట్ర భవిష్యత్తును నానశం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు తన కుమారుడి అభివృద్ధి కోసం తప్ప ప్రజల అభివృద్ది కోసం పనిచేయడం లేదని ఆరోపించారు.

కుమారుడి కోసం రాష్ట్రాన్ని పణంగా పెట్టిన చంద్రబాబు మిగతా వారిని పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు. అధికారాన్ని సుస్థిరం చేసుకునేందుకు తెలుగు ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెట్టారని అన్నారు. ప్రజలు టీడీపీని నమ్మే పరిస్థితి లేదన్నారు. కాంగ్రెస్‌తో చేతులు కలపడం ద్వారా ఎన్టీఆర్‌కు చంద్రబాబు రెండోసారి వెన్నుపోటు పొడిచారని ఆరోపించారు. కేంద్రంపై చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలని కార్యకర్తలకు మోదీ పిలుపునిచ్చారు.
Chandrababu
Narendra Modi
Nara Lokesh
BJP
Andhra Pradesh

More Telugu News