Prime Minister: ఏపీని చూస్తే మోదీకి భయమేస్తోంది: సీఎం చంద్రబాబు

  • మాటసాయం కూడా చేయని వ్యక్తి మోదీ
  • సాయం చేస్తే గుజరాత్ ను మించిపోతామన్న భయం
  • ఏపీ అభివృద్ధి చెందకుండా వెనక్కి లాగుతున్నారు
ఏపీని చూస్తే ప్రధాని మోదీకి భయమేస్తోందని సీఎం చంద్రబాబునాయుడు విమర్శించారు. ఏపీకి సాయం చేస్తే గుజరాత్ ను మించిపోతామనే భయం మోదీకి ఉందని అన్నారు. మాటసాయం కూడా చేయని వ్యక్తి మోదీ అని, ఏపీ అభివృద్ధి చెందకుండా మనల్ని వెనక్కి లాగుతున్నారని, ఎన్ని అడ్డంకులు సృష్టించినా అభివృద్ధిలో దూసుకుపోతామని మరోసారి స్పష్టం చేశారు. కేంద్రం చేస్తున్న కుట్రలపై జన్మభూమి సభల్లో చర్చించాలని  చంద్రబాబు పిలుపు నిచ్చారు. ఈ సందర్భంగా తెలంగాణ సీఎం కేసీఆర్, వైసీపీ అధినేత జగన్ పై ఆయన విమర్శలు గుప్పించారు. మోదీ, జగన్, కేసీఆర్.. ముగ్గురు మోదీలు ఒక్కటయ్యారని అన్నారు.
Prime Minister
Narendra Modi
Andhra Pradesh
cm
Chandrababu
YSRCP
Jagan
TRS
KCR

More Telugu News