Prime Minister: ప్రధాని మోదీ అన్ని రంగాల్లో విఫలమయ్యారు: సీఎం చంద్రబాబు

  • మోదీని నిలదీసిన వారిపై దాడులు చేస్తున్నారు
  • చెప్పింది వినకపోతే అణగదొక్కాలని చూస్తున్నారు
  • బీజేపీ, కోడికత్తి పార్టీ ఒక్కటే
ప్రధాని మోదీ అన్నిరంగాల్లో విఫలమయ్యారని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు విమర్శించారు. కృష్ణా జిల్లా పునాదిపాడులో ‘జన్మభూమి-మాఊరు’ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, మోదీ తన వైఫల్యాలను కప్పి పుచ్చుకునేందుకే నిలదీసిన వారిపై దాడులు చేస్తున్నారని, చెప్పింది వినకపోతే అణగదొక్కాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ, కోడికత్తి పార్టీ ఒక్కటేనని, ఈ దాడికి సంబంధించి టీడీపీపై విమర్శలు చేయడం దారుణమని, అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు.

బ్యాంకులను మోసం చేసి పారిపోయిన వాళ్లను ఇప్పుడు పట్టుకొస్తామంటున్నారని దుయ్యబట్టారు. రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించేందుకు తమపై కేంద్రం ఎదురుదాడి చేస్తోందని, ఏమీ ఇవ్వకపోగా చేస్తున్న అభివృద్ధిని అడ్డుకునేందుకు కుట్ర చేస్తున్నారని కేంద్రంపై చంద్రబాబు నిప్పులు చెరిగారు. రాష్ట్రాభివృద్ధి నిమిత్తం తాను దావోస్ పర్యటనకు వెళ్తుంటే తనపై ఆంక్షలు పెట్టి అడ్డుకోవాలని చూశారని, విదేశాలకు వెళ్లి రాష్ట్రానికి పెట్టుబడులు ఆహ్వానించడం తప్పా? అని ప్రశ్నించారు. రాష్ట్రాలంటే చిన్నచూపు చూడటం కేంద్రానికి తగదని, రాష్ట్రాలపై కేంద్రం పెత్తనం చేస్తే సహించేది లేదని, బీజేపీ లాలూచీ రాజకీయాలను తిప్పికొడతామని చంద్రబాబు అన్నారు.
Prime Minister
Narendra Modi
cm
Chandrababu

More Telugu News