అదరగొట్టేస్తోన్న 'మణికర్ణిక' తెలుగు ట్రైలర్
- ఝాన్సీ లక్ష్మీబాయిగా కంగనా
- విజయేంద్రప్రసాద్ కథాకథనాలు
- జనవరి 25న భారీ విడుదల
ఇటీవల వదిలిన హిందీ ట్రైలర్ కి అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చింది. తాజాగా తెలుగులోను ట్రైలర్ ను రిలీజ్ చేశారు. " సాహసవంతురాలైన యువతిగా.. మహారాణిగా .. మాతృమూర్తిగా .. మహా యోధురాలిగా ఈ ట్రైలర్లో కంగనా కనిపిస్తోంది. 'ప్రతి భారతీయుడిలోనూ స్వాతంత్ర్య కాంక్షను రగిల్చే కాగడాను అవుతాను నేను'. 'ఝాన్సీ మీకూ కావాలి .. నాకూ కావాలి. మీకు రాజ్యాధికారం కోసం కావాలి .. నాకు మా ప్రజలకి సేవ చేసుకోవడానికి కావాలి' అనే డైలాగ్స్ బాగున్నాయి.