జగన్ పై హత్యాయత్నం కేసులో కీలక పరిణామం... కేసును ఎన్ఐఏకు అప్పగించిన హైకోర్టు!

  • విశాఖ విమానాశ్రయంలో జగన్ పై దాడి
  • జాతీయ సంస్థ విచారణకు డిమాండ్ చేసిన వైకాపా
  • పిటిషన్ పై విచారించి నిర్ణయం వెలిబుచ్చిన న్యాయస్థానం
విశాఖపట్నం విమానాశ్రయంలో వైఎస్ జగన్ పై జరిగిన దాడి కేసు విచారణ కీలక మలుపు తిరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కోరుతున్నట్టుగా కేసు విచారణను జాతీయ సంస్థ ఎన్ఐఏకు అప్పగించాలని హైకోర్టు ఆదేశించింది. కొద్దిసేపటి క్రితం కోర్టు తన నిర్ణయాన్ని వెలిబుచ్చింది.

ఈ కేసులో శ్రీనివాసరావు మాత్రమే నిందితుడని, వెనుక మరెవరూ లేరని ఏపీ పోలీసు అధికారి లడ్డా వెల్లడించిన రెండు రోజుల్లోనే హైకోర్టు ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ తరఫున, విచారణను జాతీయ సంస్థకు అప్పగించాలని పిటిషన్ దాఖలైన సంగతి తెలిసిందే. కాగా, ఈ కేసును విమానయాన చట్టాల ప్రకారం రిజిస్టర్ చేసి, సెక్షన్ 3 (ఏ) కింద నమోదు చేయాలన్న వారి అభ్యర్థనకు హైకోర్టు అంగీకరించింది. 
Go Back to Shorts
Jagan
NIA
Murder Attempt

More Telugu News