Pawan Kalyan: ఏపీకి ప్రత్యేక హోదా కోసం జరుగుతున్న పోరాటానికి మద్దతు తెలిపిన పవన్

  • నేడు పార్లమెంట్ ముట్టడికి యత్నం
  • పోలీసుల లాఠీచార్జి
  • రామకృష్ణ, మధులకు పవన్ ఫోన్
ఏపీకి ప్రత్యేక హోదా కోసం జరుగుతున్న పోరాటానికి సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్టు జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలిపారు. ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన కోసం నేడు ప్రత్యేక హోదా సాధన కమిటీ ఆధ్వర్యంలో పార్లమెంట్ ముట్టడికి యత్నించారు. ఈ నేపథ్యంలో వామపక్ష పార్టీల నేతలు, కార్యకర్తలపై ఢిల్లీ పోలీసులు లాఠీచార్జి చేశారు. దీనిని పవన్ ఖండించారు. వామపక్ష నేతలు రామకృష్ణ, మధులకు ఫోన్ చేసి పోరాటానికి తన సంపూర్ణ మద్దతు తెలిపారు.

Pawan Kalyan
Delhi
Ramakrishna
Madhu
Parliament

More Telugu News