నాతో చర్చకు వచ్చే దమ్ము మోదీకి లేదు!: రాహుల్ గాంధీ ఫైర్
- రాహుల్కు యుద్ధ విమానం అంటే ఏంటో తెలియదన్న జైట్లీ
- తనతో 20 నిమిషాలు చర్చలో కూర్చోవాలంటూ సవాల్
- విమానం ధర పెంచింది మీరు కాదా? అంటూ ప్రధానిపై నిప్పులు
తనను ‘కిండర్గార్టెన్ అర్థమెటిక్’ అంటూ ఎద్దేవా చేసిన అరుణ్ జైట్లీని ఉద్దేశించి రాహుల్ మాట్లాడుతూ.. జైట్లీ తనకుతానే 526, 1,600 నంబర్ల గురించి చెప్పారని పేర్కొన్నారు. ‘‘మీరు దేశానికి ఏం చెప్పారు? ఇది మొత్తం రూ. 58 వేల కోట్ల డీల్ అన్నారు. దీనిని 36తో భాగిస్తే ఒక్కో విమానం ఖరీదు రూ. 1600 కోట్లు. అంటే ఒక్కో విమానం ధరను రూ.526 కోట్ల నుంచి రూ. 1600 కోట్లకు పెంచేశారు. దీనికి కారణం మోదీ కాదా?’’ అని ప్రశ్నించారు.
‘‘మోదీతో నేను చర్చకు సిద్ధం. నాకు కేవలం 20 నిమిషాల సమయం ఇవ్వండి చాలు. ముఖాముఖి చర్చించుకుంటే స్పష్టత వస్తుంది. అయితే, ప్రధానికి మాత్రం నాతో చర్చకు వచ్చే దమ్ము లేదు’’ అని రాహుల్ పేర్కొన్నారు.