మోదీ 95 నిమిషాల ఇంటర్వ్యూ సారాంశం ఇదే: ఎద్దేవా చేసిన కాంగ్రెస్
- మోదీ ఇంటర్వ్యూలో నన్ను, నేను, నాకు తప్ప మరేమీ లేదు
- పూర్తి పేరడీలా సాగింది
- మోదీ అబద్ధాలతో దేశం ఇబ్బందులు పడుతోంది
మోదీ తన ఇంటర్వ్యూలో పూర్తి వాక్చాతుర్యాన్ని ప్రదర్శించారని సూర్జేవాలా ఎద్దేవా చేశారు. ఆయన ఇంటర్వ్యూ ఓ పేరడీని తలపించిందని విమర్శించారు. నోట్ల రద్దు, గబ్బర్ సింగ్ ట్యాక్స్ (జీఎస్టీ), ధరల పెరుగుదలతో సతమతమవుతోందన్నారు. అచ్చేదిన్ ఎక్కడని ప్రశ్నించిన సూర్జేవాలా ప్రతి ఒక్కరి ఖాతాలో వేస్తామన్న రూ. 15 లక్షల సంగతేంటని ప్రశ్నించారు.