సంక్రాంతి కోసం... మరో 13 ప్రత్యేక రైళ్లు... వివరాలివి!
- ఇప్పటికే నిండుకున్న రెగ్యులర్ రైళ్లు
- కాకినాడ, సికింద్రాబాద్ మధ్య 7 రైళ్లు
- నర్సాపూర్ నుంచి సికింద్రాబాద్ కు మూడు ప్రత్యేక రైళ్లు
కాకినాడ నుంచి సికింద్రాబాద్ కు 16, 17, 20 తేదీల్లో రెండేసి. 18న ఒకటి, నర్సాపూర్ నుంచి సికింద్రాబాద్ మధ్య 18, 19, 20 తేదీల్లో ఒక్కోటి, విజయవాడ నుంచి సికింద్రాబాద్ కు 17న, సికింద్రాబాద్ నుంచి కాకినాడకు 13, 20 తేదీల్లో ఒక్కో రైలును నడిపిస్తామని, ఇవన్నీ సువిధ సర్వీసులేనని పేర్కొంది.