ప్రియా వారియర్ 'లవర్స్ డే' ఫస్టులుక్
- మలయాళంలో 'ఒరు ఆదార్ లవ్'
- తెలుగు టైటిల్ గా 'లవర్స్ డే'
- ఫిబ్రవరి 14వ తేదీన విడుదల
త్వరలోనే వాళ్ల నిరీక్షణ ఫలించనుంది. ఒమర్ లులూ దర్శకత్వం వహించిన ఈ సినిమాను తెలుగులోను విడుదల చేస్తున్నారు. 'లవర్స్ డే' అనే టైటిల్ తో ఈ సినిమాను ఫిబ్రవరి 14వ తేదీన విడుదల చేయనున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి ఫస్టులుక్ ను రిలీజ్ చేశారు. గురురాజ్ .. వినోద్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాకి షాన్ రెహ్మాన్ సంగీతాన్ని సమకూర్చాడు. ఆయన అందించిన సంగీతం యూత్ కి బాగా కనెక్ట్ అవుతుందని అంటున్నారు. తెలుగులో ఈ సినిమా సంచలనానికి తెరతీస్తుందేమో చూడాలి మరి.