Revanth Reddy: మరో రెండేళ్ల వరకూ మీడియా ముందుకు రాను: రేవంత్ సంచలన నిర్ణయం

  • నరేందర్‌రెడ్డి చేతిలో ఓటమి పాలైన రేవంత్
  • ఫలితాల తర్వాత స్వరం వినిపించలేదు
  • తన కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడి
కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి స్వరం ఎన్నికల ఫలితాల అనంతరం ఇప్పటి వరకూ ఎక్కడా వినిపించలేదు. కొడంగల్ నుంచి పోటీ చేసిన రేవంత్‌పై టీఆర్ఎస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి 9వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. అప్పటి నుంచి మీడియా ముందుకు రాని రేవంత్.. దీనిని మరో రెండేళ్ల  పాటు పొడిగిస్తానంటూ సంచలన నిర్ణయాన్ని వెల్లడించారు. దీంతో ఆయన అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు షాక్ అయ్యారు. తాను రెండేళ్ల వరకూ మీడియాతో మాట్లాడబోనని.. తన కోసమే ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్టు రేవంత్ స్పష్టం చేశారు.
Revanth Reddy
TRS
Congress
Kondangal
Narendar reddy

More Telugu News