Telangana: తెలంగాణలో ఇంటర్నేషనల్ స్వీట్ ఫెస్టివల్.. హాజరుకానున్న 10 లక్షల మంది!

  • సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో వేడుకలు
  • రెండ్రోజుల పాటు నిర్వహించేందుకు అధికారుల ఏర్పాట్లు
  • 20 దేశాల నుంచి నోరూరించే స్వీట్ల ప్రదర్శన
తెలంగాణ ప్రభుత్వం సంక్రాంతి వేళ మరో కీలక వేడుక నిర్వహించేందుకు సిద్ధమయింది. ఇప్పటికే ప్రతీఏటా సంక్రాంతి పర్వదినం సందర్భంగా ప్రభుత్వం కైట్ ఫెస్టివల్ (గాలిపటాల పండుగ) నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. దీనికి అనుబంధంగా ‘అంతర్జాతీయ స్వీట్ ఫెస్టివల్’ నిర్వహించాలని తెలంగాణ పర్యాటక, సాంస్కృతిక శాఖ నిర్ణయించింది. సికింద్రాబాద్ లోని పరేడ్ గ్రౌండ్ లో జనవరి 13 నుంచి 15 వరకూ ఈ వేడుకలు నిర్వహించనున్నారు.

కాగా, 20 దేశాలకు చెందిన స్వీట్లను ఈ సందర్భంగా స్టాళ్లలో అందుబాటులో ఉంచనున్నారు. ఈ వేడుకలకు 10 లక్షల మంది వరకూ హాజరుకావొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో సందర్శకుల తాకిడికి అనుగుణంగా ఏర్పాట్లు చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.
Telangana
sweet festival
10 lakh people
20 countries

More Telugu News