Huawei Y7 Pro 2019: అద్భుత ఫీచర్లతో హువావే నుండి నూతన స్మార్ట్ ఫోన్ విడుదల!

  • వియత్నాంలో విడుదలైన హువావే వై7 ప్రో 2019
  • రెండు కలర్ వేరియంట్ లలో లభ్యం 
  • ధర సుమారుగా రూ.11,900
చైనా మొబైల్ దిగ్గజం హువావే తాజాగా తన నూతన స్మార్ట్ ఫోన్ 'వై7 ప్రో 2019'ని వియత్నాంలో విడుదల చేసింది. భారీ బ్యాటరీ, డ్యూయల్ కెమెరాలతో పాటు పలు ఆకట్టుకునే ఫీచర్లు దీనిలో ఏర్పాటు చేశారు. అరోరా బ్లూ, బ్లాక్ అనే రెండు రంగులలో లభించే ఈ ఫోన్ మన దేశంలో సుమారుగా రూ.11,900 ధరకి లభ్యం కానుంది.

ప్రత్యేకతలు:

  • 6.26" ఫుల్ హెచ్డీ ప్ల‌స్ డిస్ప్లే (1520 × 720 రిజల్యూష‌న్‌)
  • ఆక్టాకోర్ స్నాప్‌ డ్రాగ‌న్ 450 ప్రాసెస‌ర్‌
  • 3 జీబీ ర్యామ్‌, 32 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌
  • ఆండ్రాయిడ్ 8.1 ఓరియో ఆపరేటింగ్ సిస్టం
  • 13/2 మెగాపిక్స‌ల్ డ్యుయ‌ల్ బ్యాక్ కెమెరాలు
  • 16 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా
  • 4000 ఎంఏహెచ్ బ్యాట‌రీ
Huawei Y7 Pro 2019
స్మార్ట్ ఫోన్
smartphone
Tech-News
వై7 ప్రో 2019
technology

More Telugu News