Andhra Pradesh: చంద్రబాబు జీ.. కుంభమేళాకు రండి.. ఆహ్వానించిన యూపీ ప్రభుత్వం!

  • జనవరి 15న ప్రారంభం కానున్న కుంభమేళా
  • చంద్రబాబును కలుసుకున్న మంత్రి సహానా
  • సానుకూలంగా స్పందించిన ఏపీ ముఖ్యమంత్రి
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి అరుదైన ఆహ్వానం అందింది. ఉత్తరప్రదేశ్ లో వచ్చే నెల 15 నుంచి ప్రారంభం కానున్న కుంభమేళాలో పాల్గొనాల్సిందిగా చంద్రబాబును యూపీ మంత్రి సతీశ్ మహానా ఆహ్వానించారు. అమరావతిలోని సచివాలయంలో ఈరోజు ముఖ్యమంత్రిని కలుసుకున్న సహానా.. ప్రయాగ్ రాజ్ లో ప్రారంభమయ్యే ఈ కుంభమేళాకు రావాలని కోరారు. కాగా, మంత్రి సహానా విజ్ఞప్తికి చంద్రబాబు సానుకూలంగా స్పందించారు.

కాగా, ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను కలుసుకున్న సహానా ఆయన్ను కూడా కుంభమేళాకు ఆహ్వానించారు. 2019 జనవరి 15 నుంచి మార్చి 5 వరకూ ఈ కుంభమేళా జరగనుంది. దీనికి దేశవిదేశాల నుంచి లక్షలాది మంది హిందువులు హాజరై పుణ్య స్నానాలు ఆచరిస్తారు.
Andhra Pradesh
Chandrababu
Uttar Pradesh
sahana
invitation
government
kumbhmela

More Telugu News