Andhra Pradesh: సొంతగూటికి చేరిన గుర్నాథ్ రెడ్డి.. కండువా కప్పి వైసీపీలోకి ఆహ్వానించిన జగన్!

  • నిన్న టీడీపీకి గుడ్ బై చెప్పిన గుర్నాథ్ రెడ్డి
  • పలాస నియోజకవర్గంలో జగన్ తో భేటీ
  • ఏడాది క్రితం టీడీపీలో చేరిన నేత
అనంతపురం మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్ రెడ్డి నిన్న టీడీపీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. చంద్రబాబు పాలన బాగుందని టీడీపీలో చేరి తప్పుచేశానని రాజీనామా సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు. తాజాగా ఈరోజు గుర్నాథ్ రెడ్డి వైసీపీలో చేరారు. శ్రీకాకుళం జిల్లాలోని పలాస నియోజకవర్గం అక్కుపల్లి వద్ద ప్రజాసంకల్ప యాత్ర చేస్తున్న జగన్ ను ఆయన కలుసుకున్నారు. ఈ సందర్భంగా గుర్నాథ్ రెడ్డికి వైసీపీ కండువా కప్పిన జగన్ ఆయన్ను పార్టీలోకి ఆహ్వానించారు.

కాగా, జగన్ తోనే ఏపీ అభివృద్ధి సాధ్యమని గుర్నాథ్ రెడ్డి వ్యాఖ్యానించారు. 2019లో ఆంధ్రప్రదేశ్ లో వైసీపీనే అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పారు. 2014 ఎన్నికల్లో అనంతపురం నుంచి పోటీ చేసి టీడీపీ అభ్యర్థి ప్రభాకర్ చౌదరి చేతిలో ఓటమి పాలయ్యారు. గతేడాది టీడీపీలో చేరిన గుర్నాథ్ రెడ్డి.. తాజాగా తిరిగి సొంతగూటికి చేరారు.
Andhra Pradesh
Anantapur District
YSRCP
Telugudesam
gurunatha reddy
join

More Telugu News