kcr: నిన్న కేసీఆర్ దారుణంగా మాట్లాడారు.. ఇది మంచి పద్ధతి కాదు: సీఎం చంద్రబాబు

  • కేసీఆర్ హుందాతనం లేకుండా మాట్లాడుతున్నారు
  • నోటికొచ్చినట్టు మాట్లాడటం సబబు కాదు
  • నేనెప్పుడూ హుందాతనాన్ని కోల్పోయి మాట్లాడలేదు
నిన్న కేసీఆర్ తనపై దారుణంగా మాట్లాడారని.. ఇది మంచి పద్ధతి కాదని సీఎం చంద్రబాబు హితవు పలికారు. అమరావతిలో నిర్వహిస్తున్న మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కేసీఆర్ హుందాతనం లేకుండా, పద్ధతి లేకుండా అసభ్యకరమైన భాష మాట్లాడారని, దీనిని ఖండిస్తున్నానని అన్నారు. ఇంత హుందాతనం లేకుండా మాట్లాడటం, నోటికొచ్చినట్టు మాట్లాడటం సబబు కాదని అన్నారు.

తానెప్పుడూ పద్ధతి లేని రాజకీయాలు చేయలేదని, విలువలతో కూడిన రాజకీయాలు చేశానని, ఎప్పుడూ హుందాతనాన్ని కోల్పోయి మాట్లాడలేదని స్పష్టం చేశారు. తననే కాదు, కాంగ్రెస్ పార్టీని, మోదీపైనా కేసీఆర్ దారుణంగా మాట్లాడుతున్నారని దుమ్మెత్తిపోశారు. రాజకీయాల్లో కొంత హుందాతనం, విలువలు ఉంటాయని, అధికారంలో ఉండే వ్యక్తులు చాలా హుందాగా వ్యవహరించాలని సూచించారు. నాగరిక ప్రపంచం ఆయన తీరును మెచ్చుకోదని, నోరుంది కదా అని ఇష్టానుసారం మాట్లాడటం పద్ధతి కాదని అన్నారు.
kcr
Chandrababu
Andhra Pradesh
Telangana

More Telugu News