Andhra Pradesh: గుంటూరులో నాగేంద్రుడి గుడి మండపాన్ని కూల్చేందుకు అధికారుల యత్నం.. అడ్డుకున్న స్థానికులు!

  • కొండవీటి వాగు దగ్గర ఘటన
  • అధికారుల్ని నిలువరించిన గ్రామస్తులు
  • ఆలయాన్ని తాకితే ఊరుకోబోమని హెచ్చరిక
ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లాలో ఈరోజు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఇక్కడి కొండవీటి వాగు సమీపంలో ఉన్న నాగేంద్రుడి ఆలయం మండపాన్ని తొలగించేందుకు జలవనరుల అధికారులు యత్నించారు. దీంతో స్థానికులు వారిని అడ్డుకున్నారు. అధికారులను చుట్టుముట్టి వాగ్వాదానికి దిగారు. ఈ నేపథ్యంలో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు గ్రామస్తులను సముదాయించారు. అయితే ఆలయాన్ని తాకితే ఊరుకోబోమని స్థానికులు జలవనరుల శాఖ అధికారులను హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ఓవైపు గ్రామస్తులు, మరోవైపు పోలీస్ అధికారుల మోహరింపుతో ఇక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
Andhra Pradesh
Guntur District
temple

More Telugu News