ప్రధాని ర్యాలీ నుంచి వస్తున్న కానిస్టేబుల్‌ను రాళ్లతో కొట్టి చంపిన ఆందోళనకారులు
- బరేలీలో ప్రధాని ర్యాలీ
- విధులు ముగించుకుని వస్తుండగా ఘటన
- తీవ్రంగా స్పందించిన సీఎం యోగి
ఇదే ర్యాలీలో పాల్గొన్న యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈ ఘటనపై తీవ్రంగా స్పందించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా జిల్లా మేజిస్ట్రేట్, ఎస్పీలను ఆదేశించారు. మృతి చెందిన కానిస్టేబుల్ భార్యకు రూ. 40 లక్షలు, అతడి తల్లిదండ్రులకు రూ. 10 లక్షలు నష్టపరిహారాన్ని ప్రకటించారు. ఆయన కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వనున్నట్టు పేర్కొన్నారు.
ప్రధాని ర్యాలీకి, ఈ హింసకు ఎటువంటి సంబంధం లేదని యూపీ డీజీపీ ఓపీ సింగ్ తెలిపారు. రోడ్లను దిగ్బంధం చేసినందుకు అరెస్ట్ చేసిన నలుగురు కార్యకర్తలను వదిలిపెట్టాలనే డిమాండ్‌తోనే నిషాద్ పార్టీ కార్యకర్తలు ఆందోళనకు దిగినట్టు చెప్పారు.