Cable Operators: కేబుల్ టీవీ ఆపరేటర్ల ఆందోళన.. రేపు వార్తా ఛానళ్లు మాత్రమే వస్తాయి!

  • ఉదయం 10 - రాత్రి 8 వరకూ ప్రసారాల నిలిపివేత
  • ట్రాయ్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళన
  • 400 ఛానళ్లను 200-250కే అందిస్తున్నాం
వీకెండ్‌లో ఎంటర్‌టైన్‌మెంట్ ఛానెల్స్ చూస్తూ ఆనందించే ప్రేక్షకులకు కేబుల్ ఆపరేటర్లు షాక్ ఇచ్చారు. రేపు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు వార్తా ఛానళ్లు మినహా మిగిలిన చానల్స్ ను నిలిపివేస్తామని వెల్లడించారు. ట్రాయ్ ప్రకటించిన కొత్త టారిఫ్‌ను వ్యతిరేకిస్తూ ఒక్కరోజు ఆందోళనలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు కేబుల్ ఆపరేటర్లు తెలిపారు. మరోవైపు కొత్త టారిఫ్ అమలుకు ట్రాయ్ జనవరి 31, 2019ని డెడ్‌లైన్‌గా విధించింది.

ఈ అంశంపై ఏపీ రాష్ట్ర కేబుల్ ఆపరేటర్ వెల్‌ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కృష్ణారెడ్డి మాట్లాడుతూ.. ట్రాయ్ నిర్ణయం వల్ల వినియోగదారులు రూ.400 - 450 కేబుల్ బిల్లు కట్టాల్సి ఉంటుందన్నారు. తాము 400 ఛానల్స్‌ను రూ.200 - 250 ఛార్జ్ చేస్తున్నామని ఆయన తెలిపారు. గ్రేటర్ హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల కేబుల్ ఆపరేటర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ హరి గౌడ్ లింగాల మాట్లాడుతూ.. ట్రాయ్ డెడ్‌లైన్‌ను పొడిగించడం కాదని.. వెనక్కి తీసుకునే వరకూ తమ పోరాటం ఆగదన్నారు.
Cable Operators
TRAI
Krishna Reddy
Hari Goud
Hyderabad
Andhra Pradesh

More Telugu News