Tollywood: హాలిడే ట్రిప్ ఎంజాయ్ చేస్తున్న మహేశ్ బాబు కుటుంబం!

షార్ట్స్‌లో చూడండి
ఎగవేసిన జీఎస్టీ పన్ను బకాయిలు తక్షణం చెల్లించాలంటూ హీరో మహేశ్ బాబుకు నోటీసులు జారీ అయిన విషయం హాట్ టాపిక్ గా మారింది. మహేశ్ బ్యాంకు అకౌంట్స్ ని కూడా అటాచ్ చేశారు. ఈ నోటీసులపై మహేశ్ బాబు లీగల్ టీమ్ తాజాగా స్పందించడం తెలిసిందే. అయితే, ప్రస్తుతం మహేశ్ బాబు ఎక్కడున్నాడన్న విషయమై ఆయన అభిమానుల్లో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో మహేశ్ బాబు భార్య నమ్రతా శిరోద్కర్ పోస్ట్ చేసిన ఓ ఫొటో ద్వారా ప్రస్తుతం వారు హాలిడే ట్రిప్ లో ఉన్నట్టు అర్థమవుతోంది. క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకలను ఎంజాయ్ చేసేందుకు విదేశాలకు మహేశ్ బాబు కుటుంబం వెళ్లినట్టు సమాచారం. 
Go Back to Shorts
Tollywood
Mahesh Babu
new year
x-mas

More Telugu News