Vijay Devarakonda: రాజకీయాలపై దృష్టి సారించేంత సమయం లేదు: విజయ్ దేవరకొండ

  • సన్నివేశాలు సహజంగా ఉండాలంటే రిస్క్ తప్పదు
  • వాస్తవికతకు అద్దం పట్టేలా చిత్రాన్ని తెరకెక్కించాం
  • సినీ పరిశ్రమలో నిలదొక్కుకునేందుకు ప్రయత్నిస్తున్నా
ఇటీవల షూటింగ్‌లో భాగంగా రైల్వే స్టేషన్‌లో జరిగిన ప్రమాదంపై విజయ్ దేవరకొండ స్పందించారు. కాకినాడలో షూటింగ్ జరుపుకుంటున్న ‘డియర్ కామ్రేడ్’ సినిమాకు తాజాగా చిత్రబృందం గుమ్మడికాయ కొట్టేసింది. ఈ సందర్భంగా విజయ్ మాట్లాడుతూ తనకు జరిగిన ప్రమాదంపై స్పందించారు. సినిమాల్లో కొన్ని సన్నివేశాలు సహజంగా ఉండాలంటే రిస్క్ తప్పదన్నారు.

‘డియర్ కామ్రేడ్’ చిత్రాన్ని పూర్తిగా కాకినాడ నేపథ్యంలోనే తెరకెక్కించామన్నారు. దర్శకుడు భరత్ వాస్తవికతకు అద్దం పట్టేలా కాకినాడ మార్కెట్, జగన్నాథపురం బ్రిడ్జ్, బీచ్ ప్రాంతాల్లో ఎక్కువగా సన్నివేశాలు చిత్రీకరించారన్నారు. పెళ్లి విషయం గురించి ప్రస్తావిస్తూ, తనకు ఎప్పుడు చేసుకోవాలనిపిస్తే అప్పుడు చేసుకుంటానని విజయ్ తెలిపాడు. రాజకీయాలపై దృష్టిసారించేంత సమయం తనకు లేదని.. సినీ పరిశ్రమలో నిలదొక్కుకునేందుకు ప్రయత్నిస్తున్నానని అన్నారు.
Vijay Devarakonda
Kakinada
Bharath
Dear Comrade

More Telugu News