delhi: పర్యటన ముగించుకుని హైదరాబాద్ చేరుకున్న సీఎం కేసీఆర్

  • ఈరోజు సాయంత్రం హైదరాబాద్ వచ్చిన కేసీఆర్
  • బేగంపేట విమానాశ్రయంలో ఘనస్వాగతం
  • ఈ నెల 23న రాష్ట్రాల పర్యటనకు వెళ్లిన కేసీఆర్
తెలంగాణ సీఎం కేసీఆర్ బీజేపీ యేతర ఫ్రంట్ ఏర్పాటు లక్ష్యంగా ఈ నెల 23న వివిధ రాష్ట్రాల పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా ఈ నెల 24న ఢిల్లీ వెళ్లిన కేసీఆర్ ఇన్నాళ్లూ అక్కడే బస చేశారు. ఢిల్లీ పర్యటన ముగించుకున్న కేసీఆర్ ఈరోజు సాయంత్రం హైదరాబాద్ చేరుకున్నారు. బేగంపేట విమానాశ్రయంలో కేసీఆర్ కు పార్టీ నేతలు, న్యాయవాదులు ఘన స్వాగతం పలికారు.

 కాగా, రాష్ట్రాల పర్యటనలో భాగంగా తొలుత ఏపీలోని విశాఖ పట్టణంలో స్వరూపానందేంద్ర సరస్వతిని కేసీఆర్ కలుకున్నారు. అక్కడి నుంచి ఒడిశా వెళ్లి సీఎం నవీన్ పట్నాయక్ ని కలిశారు. 24వ తేదీన పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో భేటీ అయిన కేసీఆర్, అదే రోజు రాత్రి ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. ఈ నెల 26న ప్రధాని మోదీని,  పలువురు మంత్రులను కేసీఆర్ కలిశారు.
delhi
Hyderabad
kcr
modi
rajnath
Odisha

More Telugu News