'ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్' సినిమాపై మన్మోహన్ సింగ్ స్పందన
- వివాదాస్పదమైన 'ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్'
- ఆగ్రహం వ్యక్తం చేస్తున్న కాంగ్రెస్ నేతలు
- నో కామెంట్ అంటూ స్పందించిన మన్మోహన్
ఈ సినిమాకు సంబంధించి మీడియా ప్రతినిధులు ఈరోజు మన్మోహన్ సింగ్ ను ప్రశ్నించారు. దీనికి ఆయన తన స్పందనగా, 'నో కామెంట్' అంటూ వెళ్లిపోయారు. కాంగ్రెస్ 134వ వ్యవస్థాపకదినం వేడుకల నేపథ్యంలో, ఈరోజు మన్మోహన్ కాంగ్రెస్ కార్యాలయానికి వచ్చారు. ఈ సందర్భంగా, 'మీపై తీసిన సినిమాపై మీరు ఏమనుకుంటున్నారు' అని మీడియా ప్రశ్నించింది. ఒక్క క్షణం అక్కడ ఆగి... నో కామెంట్ అంటూ ఆయన అక్కడ నుంచి వెళ్లిపోయారు.