కోహ్లీ గొప్ప ఆటగాడే, కానీ.. విరాట్‌పై మరోమారు విమర్శలు గుప్పించిన బాలీవుడ్ నటుడు
- మైదానంలో హుందాగా ప్రవర్తించాలి
- సీనియర్లను చూసి నేర్చుకోవాలి
- ప్రజలు లిప్ రీడింగ్‌ను కూడా చదవగలరు
తాజాగా, నసీరుద్దీన్ మరోమారు కోహ్లీపై అటువంటి వ్యాఖ్యలే చేశాడు. కోహ్లీ తన సీనియర్లను చూసి నేర్చుకోవాల్సింది చాలా ఉందని, ముఖ్యంగా హుందాగా ప్రవర్తించడం నేర్చుకోవాలని షా సూచించాడు. అతడు గొప్ప ఆటగాడన్న విషయాన్ని తాను అంగీకరిస్తానని, ఈ విషయంలో అతడిని ప్రశంసిస్తానని, అయితే మైదానంలో అతడి ప్రవర్తన గురించి అతడే ఆలోచించుకోవాలని అన్నాడు. ప్రజలు లిప్ రీడింగ్ (పెదవుల కదలికలను బట్టి తెలుసుకోవడం) కూడా చేయగలరని, కాబట్టి హుందాగా మెలగడం నేర్చుకుంటే మంచిదని అన్నాడు. క్రికెటర్‌గా కోహ్లీ సాధించిన విజయాలు అతడి దుందుడుకు స్వభావం, చెత్త ప్రవర్తన వల్ల ఎందుకూ కొరగాకుండా పోతున్నాయని నసీరుద్దీన్ షా అభిప్రాయపడ్డాడు.