january1: జనవరి 1న అమ్మాయి పుడితే కనుక.. రూ.5 లక్షలు పట్టుకెళ్లండి!: బెంగళూరు మేయర్ బంపర్ ఆఫర్

  • పింక్ బేబీ పథకాన్ని అమలు చేస్తున్న బీబీఎంపీ
  • అమ్మాయిల పేరు మీద డిపాజిట్
  • చదువుకు అండగా ఉండేందుకు నిర్ణయం
కర్ణాటక రాజధాని బెంగళూరు మేయర్ గంగాంబిక బంపర్ ఆఫర్ ప్రకటించారు. 2019, జనవరి 1న పుట్టే 24 మంది అమ్మాయిలకు తలా రూ.5 లక్షలు అందిస్తామని తెలిపారు. బృహత్ బెంగళూరు మహానగర పాలికే(బీబీఎంపీ) తరఫున ఈ మొత్తాన్ని అందిస్తామని వెల్లడించారు. ఇందుకోసం గతేడాదే ‘పింక్ బేబీ’ పేరుతో పథకాన్ని తీసుకొచ్చామని పేర్కొన్నారు. బీబీఎంపీ పరిధిలోని 24 ప్రభుత్వ ఆసుపత్రుల్లో జనవరి 1న పుట్టిన చిన్నారులకే ఈ పథకం వర్తిస్తుందని స్పష్టం చేశారు. ఈ మొత్తాన్ని చిన్నారుల పేరు మీద డిపాజిట్ చేస్తామనీ, తద్వారా వారి చదువుతో పాటు వివాహ సమయంలో ఈ మొత్తం ఉపయోగపడుతుందని అభిప్రాయపడ్డారు. ఒకవేళ జనవరి 1న కాకుండా రెండో తేదీన అమ్మాయి పుట్టినా బహుమతిగా రూ.5 లక్షలు అందిస్తామని తెలిపారు. 
january1
girl
born
rs.5 lakh gift
banlore
Karnataka
mayor
announcement
pink baby scheme
bbmp

More Telugu News