modi: మోదీకి సీఎం హోదాలో చంద్రబాబు స్వాగతం పలకాలి: మాణిక్యాల రావు

  • దేవాలయాల్లో అభివృద్ది కుంటుపడింది
  • ఆలయ నిధులను పార్టీ ప్రచారాలకు ఉపయోగిస్తే... ఉద్యమిస్తాం
  • కడప స్టీల్ ప్లాంట్ ను నిర్మించేది కేంద్ర ప్రభుత్వమే
ఏపీ పర్యటనకు ప్రధాని మోదీ వస్తున్న నేపథ్యంలో టీడీపీ, బీజేపీ శ్రేణుల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ప్రధానిని ఆహ్వానించేందుకు చంద్రబాబు వెళ్లకపోవచ్చనే ప్రచారం కూడా సాగుతోంది. ఈ నేపథ్యంలో బీజేపీ నేత, మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాల రావు మాట్లాడుతూ, ఏపీకి వస్తున్న ప్రధానికి ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు స్వాగతం పలకాలని సూచించారు.

ఈరోజు ఆయన అన్నవరం సత్యనారాయణ స్వామివారిని దర్శించుకున్నారు. ఆ తర్వాత, అక్కడ జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, దేవాదాయ శాఖ మంత్రిగా తాను రాజీనామా చేసిన తర్వాత... దేవాలయాల్లో అభివృద్ది కుంటుపడిందని చెప్పారు. దేవాలయాల నిధులను పార్టీ ప్రచారాలకు ఉపయోగిస్తే భక్తుల తరపున బీజేపీ ఉద్యమిస్తుందని హెచ్చరించారు. కడప స్టీల్ ప్లాంట్ ను నిర్మించేది కేంద్ర ప్రభుత్వమేనని చెప్పారు.
modi
ap tour
Chandrababu
manikyala rao
Telugudesam
bjp

More Telugu News