jdu: ఎవరూ పట్టించుకోలేదంటూ పదవికి రాజీనామా చేసిన జేడీయూ ఎమ్మెల్యే

  • అధికారులెవరూ నా ఫిర్యాదులను పట్టించుకోవడం లేదు
  • ల్యాండ్ మాఫియాను పోలీసులు చూసీ చూడనట్టు వదిలేస్తున్నారు
  • ఎమ్మెల్యేగా ఉండి ప్రయోజనం లేదు
అధికారులెవరూ తనను పట్టించుకోవడం లేదంటూ ఏకంగా పదవికే రాజీనామా చేశారు బీహార్ లోని అధికార పార్టీ జేడీయూ ఎమ్మెల్యే శ్యామ్ బహదూర్ సింగ్. నియోజకవర్గంలోని అధికారులు తన మాట వినడం లేదని... ఎమ్మెల్యేగా ఉండి ప్రయోజనం ఏమిటని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తన ఫిర్యాదులను అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు.

ప్రభుత్వ భూములను ల్యాండ్ మాఫియా ఆక్రమిస్తున్నా... పోలీసులు, అధికారులు చూసీ చూడనట్టు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఈ రాజీనామా వ్యవహారంపై జేడీయూ రాష్ట్ర అధ్యక్షుడు వషియంత్ నారాయణ్ స్పందిస్తూ, బహదూర్ ఫిర్యాదులు నిజాయతీగా ఉంటాయని చెప్పారు. పార్టీలో ఆయన సీనియర్ నేత అని... ఆయన ఆవేదనను పార్టీ అర్థం చేసుకుంటుందని తెలిపారు.  
jdu
mla
resign
bihar

More Telugu News