jagan: పునాదులు కూడా పూర్తవ్వని పోలవరం ప్రాజెక్టుకు చంద్రబాబు గేట్లు పెడతారట: జగన్ ఎద్దేవా

  • అమరావతి, పోలవరం విషయంలో రోజుకొక సినిమా చూపిస్తున్నారు
  • రాష్ట్రానికి ఏమీ చేయలేకపోయిన చంద్రబాబు రాజకీయాల నుంచి తప్పుకోవాలి
  • చంద్రబాబు శ్వేతపత్రాలను ఎవరూ నమ్మరు
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైసీపీ అధినేత జగన్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఎన్నికలు వచ్చినప్పుడు అబద్ధాలు చెప్పడం చంద్రబాబుకు అలవాటేనని చెప్పారు. అమరావతి, పోలవరం ప్రాజెక్టు విషయంలో చంద్రబాబు రోజుకొక సినిమా చూపిస్తున్నారని అన్నారు. పునాదులు కూడా పూర్తవ్వని పోలవరం ప్రాజెక్టుకు చంద్రబాబు గేట్లు పెడతారట అంటూ ఎద్దేవా చేశారు. నాలుగున్నరేళ్లు బీజేపీతో కాపురం చేసి... కేంద్రం అన్యాయం చేసిందంటూ ఇప్పుడు విమర్శిస్తున్నారని మండిపడ్డారు.

ఇంతమంది ఎంపీలను పెట్టుకుని రాష్ట్రానికి ఏమీ చేయలేకపోయిన చంద్రబాబు... రాజకీయాల నుంచి తప్పుకోవాలని జగన్ డిమాండ్ చేశారు. బీజేపీతో ఉన్నప్పుడు కాంగ్రెస్ ను భూస్థాపితం చేయాలన్న చంద్రబాబు... ఇప్పుడు కాంగ్రెస్ తో చేతులు కలిపి బీజేపీని భూస్థాపితం చేయాలంటున్నారని ఎద్దేవా చేశారు. ఇప్పుడు శ్వేతపత్రాలను విడుదల చేస్తున్న చంద్రబాబును ఎవరూ నమ్మే పరిస్థితిలో లేరని చెప్పారు.
jagan
Chandrababu
polavaram
bjp
congress
Telugudesam
ysrcp

More Telugu News