Chandrababu: కేసీఆర్ గారు.. పోలవరంకు అడ్డు పడవద్దు: చంద్రబాబు

  • ఆంధ్రుల జీవనాడి పోలవరంకు అడ్డుపడవద్దు
  • పోలవరం వల్ల ఒడిశాకు 5 టీఎంసీల నీటి లభ్యత ఉంటుంది
  • మోదీ, జగన్ లు ఒకరికొకరు సహకరించుకుంటున్నారు
ఆంధ్రప్రదేశ్ కు జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టును అడ్డుకునే ప్రయత్నం చేయవద్దని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఏపీ సీఎం చంద్రబాబు కోరారు. ప్రాజెక్టుకు అడ్డుపడవద్దని ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ కు విన్నవించారు. పోలవరం వల్ల ఒడిశాకు 5 టీఎంసీల నీటి లభ్యత ఉంటుందని చెప్పారు. రాష్ట్రానికి అన్యాయం చేస్తున్న ప్రధాని మోదీతో వైసీపీ అధినేత జగన్ లాలూచీ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. అంతర్గతంగా ఇద్దరూ ఒకరికొకరు సహకరించుకుంటున్నారని దుయ్యబట్టారు. ఎవరెన్ని కుట్రలు చేసినా రాష్ట్రాభివృద్ధి కోసం ముందుకు సాగుతానని చెప్పారు. 
Chandrababu
polavaram
modi
jagan
kcr
navin patnaik

More Telugu News