Chandrababu: పోలవరం ప్రాజెక్టు పనుల్లో మరో చారిత్రాత్మక ఘట్టం.. మొదటి స్పిల్ వే గేటు స్థాపన

  • కీలకమైన గేట్ల బిగింపు ప్రక్రియ ప్రారంభం
  • 41వ గేటు వద్ద పూజలు నిర్వహించిన చంద్రబాబు
  • ప్రధాని మోదీపై మండిపాటు
పోలవరం ప్రాజెక్టులో కీలక ఘట్టాన్ని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు ప్రారంభించారు. డ్యాంకు అత్యంత కీలకమైన గేట్ల బిగింపు ప్రక్రియను ప్రారంభించారు. 41వ గేటు వద్ద ఆయన పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా ప్రాజెక్టును పూర్తి చేసి జాతికి అంకితం చేస్తానని చెప్పారు. పోలవరం ప్రాజెక్టును చూసేందుకు ప్రధాని మోదీ ఇంతవరకు రాలేదని విమర్శించారు. గుజరాత్ ప్రాజెక్టులపై ఆయనకున్న మక్కువ ఇతర రాష్ట్రాల ప్రాజెక్టులపై లేదని అన్నారు. కేవలం గుజరాత్ కే ప్రధానిలా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. ఇతర రాష్ట్రాలతో చర్చలు జరిపి అడ్డంకులను తొలగిస్తానని చెప్పారు.
Chandrababu
polavaram
spillway
gate
modi

More Telugu News