లుక్ అదిరింది అంటోన్న మోహన్ లాల్ అభిమానులు
- పరాజయం పాలైన 'ఒడియన్'
- షూటింగు దశలో 'మరక్కార్'
- చారిత్రక నేపథ్యంలో సాగే కథ
విభిన్నమైన కథా చిత్రాల దర్శకుడిగా ప్రియదర్శన్ కి మంచి పేరు వుంది. ఆయన దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. మోహన్ లాల్ లుక్ చూస్తుంటే చారిత్రక నేపథ్యంలో ఈ కథ కొనసాగనున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో కీలకమైన పాత్రలో కీర్తి సురేశ్ నటిస్తోంది. ఇక ప్రియదర్శన్ కూతురైన కల్యాణి ప్రియదర్శన్ .. మోహన్ లాల్ తనయుడైన ప్రణవ్ మోహన్ లాల్ జంటగా నటిస్తుండటం మరో విశేషం. మోహన్ లాల్ అభిమానులంతా ఈ సినిమాపైనే దృష్టి పెట్టారు.