Chandrababu: పోలవరం ప్రాజెక్టులో కీలకఘట్టం.. రేపట్నుంచి గేట్ల బిగింపు.. హాజరవుతున్న చంద్రబాబు

  • 41వ గేటు అమరిక కోసం పూజలు నిర్వహించనున్న చంద్రబాబు
  • అనంతరం రైతుల బహిరంగసభలో పాల్గొననున్న సీఎం
  • ఆ తర్వాత ప్రాజెక్టుపై అధికారులతో సమీక్ష
ఏపీకి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి రేపు కీలక ఘట్టం ప్రారంభంకానుంది. డ్యాంకు గేట్లను బిగించే కార్యక్రమాన్ని రేపు ప్రారంభిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరుకానున్నారు. స్పిల్ వేలో 41వ గేటు అమరిక కోసం ప్రాజెక్టు ప్రాంతంలో ముఖ్యమంత్రి పూజలు నిర్వహించనున్నారు.

ఉదయం అమరావతి నుంచి పోలవరంకు చంద్రబాబు హెలికాప్టర్ లో బయల్దేరుతారు. ఉదయం 9.30 గంటల నుంచి 10 గంటల వరకు గేటు ఏర్పాటు కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. అనంతరం 10.30 గంటలకు ప్రాజక్టు పనులను ఆయన పరిశీలిస్తారు. ఆ తర్వాత రైతులు ఏర్పాటు చేసిన బహిరంగసభలో ఆయన పాల్గొంటారు. అనంతరం ప్రాజెక్టు పురోగతి పనులపై అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. మధ్యాహ్నం ఒంటి గంటకు విజయవాడకు తిరుగుపయనమవుతారు. 
Chandrababu
polavaram
project
gates

More Telugu News