bjp: జార్ఖండ్ అసెంబ్లీ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి విజయం!

  • జార్ఖండ్ లోని కొలెబిరా అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక
  • జయకేతనం ఎగుర వేసిన కాంగ్రెస్
  • జార్ఖండ్ లో అధికారంలో ఉన్న బీజేపీ
జార్ఖండ్ లోని కొలెబిరా అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ ఓటమిపాలైంది. కాంగ్రెస్ అభ్యర్థి నమన్ బిక్సల్ కొంగరి 9,658 ఓట్ల మెజర్టీతో బీజేపీ అభ్యర్థిపై జయకేతనం ఎగురవేశారు. నమన్ కు 40,343 ఓట్లు రాగా, బీజేపీ అభ్యర్థి సొరెగ్ కు 30,685 ఓట్లు వచ్చాయి. జార్ఖండ్ లో బీజేపీ ప్రభుత్వమే ఉన్న సంగతి గమనార్హం.

కాగా, మొన్నటి వరకు ఈ స్థానానికి ప్రాతినిధ్యం వహించిన 'జార్ఖండ్ పార్టీ'కి చెందిన ఎరోస్ ఎక్కా ఓ హత్య కేసులో యావజ్జీవ శిక్షకు గురి కావడంతో ఈ సీటు ఖాళీ అయింది. ఇక్కడి నుంచి పోటీ చేసిన ఆయన భార్య మీనన్ ఎక్కాకు కేవలం 16,445 ఓట్లు మాత్రమే వచ్చాయి. 
bjp
jharkhand
by election
congress

More Telugu News