modi: మోదీ, జగన్ పై విరుచుకుపడ్డ దేవినేని ఉమ

  • ఏపీ అభివృద్ధి చెందడం జగన్ కు ఇష్టం లేదు
  • ‘పోలవరం’ నిర్మాణం ఆయనకు గిట్టట్లేదు
  • తెలుగు జాతిపై మోదీ కక్ష గట్టారు
ఏపీ ప్రతిపక్ష నేత జగన్ పై మంత్రి దేవినేని ఉమ మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ అభివృద్ధి చెందడం జగన్ కు ఇష్టం లేదని, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం జరగడం ఆయనకు ఇష్టం లేదని విమర్శించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీపై కూడా ఉమ విమర్శలు చేశారు. తెలుగు జాతిపై మోదీ కక్ష గట్టారని, ఏపీకి కేంద్రం ఇచ్చిన నిధులను వెనక్కి తీసుకుందని దుయ్యబట్టారు. ఏపీకి కేంద్రం చేసిన మోసాన్ని నిరసిస్తూ ఈ నెల 26న ధర్మపోరాట దీక్ష చేపట్టనున్నామని, ఈ దీక్షకు సీఎం చంద్రబాబు హాజరవుతారని చెప్పారు.
modi
Jagan
devineni uma
polavaram
ap

More Telugu News