MIM: కోలుకున్న అక్బరుద్దీన్.. ఆసుపత్రి నుంచి ఈరోజు డిశ్చార్జి!

  • తీవ్ర కడుపునొప్పికి గురైన అక్బరుద్దీన్
  • కాంచన్ బాగ్ లోని ఒవైసీ ఆసుపత్రిలో చికిత్స
  • అక్బరుద్దీన్ ని పరామర్శించిన సోదరుడు అసదుద్దీన్
అనారోగ్యం కారణంగా ఆసుపత్రిలో చేరిన ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ కోలుకున్నారు. ఈ రోజు ఆయనను డిశ్చార్జి చేయనున్నట్టు సమాచారం. కాగా, అక్బరుద్దీన్ అస్వస్థతకు గురైన విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. రెండు రోజుల క్రితం తీవ్ర కడుపు నొప్పికి గురైన ఆయన్ని కాంచన్ బాగ్ లోని ఒవైసీ ఆసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఆయన అక్కడే చికిత్స పొందుతున్నారు. అక్బరుద్దీన్ ని ఆయన కుటుంబసభ్యులు, బంధువులు సహా సోదరుడు అసదుద్దీన్ ఒవైసీ పరామర్శించారు. 
MIM
MLA akbaruddin
chandrayana gutta
kanchanbagh
owaisi
assaduddin

More Telugu News