స్టాలిన్ వ్యాఖ్యలతో మాకు సంబంధం లేదు: చంద్రబాబు
- ప్రధాని అభ్యర్థి ఎవరో ఎన్నికల తర్వాత నిర్ణయిస్తాం
- అందరూ కలసి తీసుకోవాల్సిన నిర్ణయం ఇది
- ఎన్నికల తర్వాత నా నిర్ణయాన్ని వెల్లడిస్తా
ప్రధాని అభ్యర్థి ఎవరు అనేది ఒకరు తీసుకునే నిర్ణయం కాదని... కూటమిలోని నేతలంతా కలసి తీసుకోవాల్సిన నిర్ణయమని చంద్రబాబు తెలిపారు. ఎన్నికల తర్వాత తన నిర్ణయాన్ని వెల్లడిస్తానని చెప్పారు. ఇప్పటికిప్పుడు ఈ అంశంపై వ్యాఖ్యలు చేయడం సరికాదని అన్నారు. ఈ కాంక్లేవ్ లో రాష్ట్ర రాజకీయాలు, ఎన్డీయే ప్రభుత్వ వైఖరి, లోక్ సభ ఎన్నికలపై ఆయన విస్తృతంగా మాట్లాడారు.