బెల్లంకొండ శ్రీనివాస్ దగ్గరికి వచ్చిన 'టైగర్ నాగేశ్వరరావు'కథ?
- మరో బయోపిక్ గా 'టైగర్ నాగేశ్వరరావు'
- నిన్నమొన్నటి వరకూ హీరోగా రానా పేరు ప్రచారం
- తాజాగా తెరపైకి బెల్లంకొండ శ్రీనివాస్ పేరు
ఈ బయోపిక్ ను ముందుగా నానితో చేయనున్నట్టుగా ప్రచారం జరిగింది. ఆ తరువాత రానా పేరు తెరపైకి వచ్చింది. ఈ రాబిన్ హుడ్ తరహా పాత్రకి రానా సరిగ్గా సరిపోతాడనే టాక్ ఫిల్మ్ నగర్లో బలంగా వినిపించింది. కానీ ఇప్పుడు ఈ సినిమా రానా కూడా చేయడం లేదనేది తాజా సమాచారం. ఈ కారణంగానే ఈ కథ బెల్లంకొండ శ్రీనివాస్ దగ్గరికి వచ్చిందట. ప్రస్తుతం బెల్లంకొండ శ్రీనివాస్ .. దర్శకుడు వంశీకృష్ణ మధ్య కథా చర్చలు జరుగుతున్నాయట. బెల్లంకొండ శ్రీనివాస్ ఓకే అంటాడో లేదో చూడాలి మరి.