రాని యుద్ధాల కోసం.. పోయిన చోటల్లా విమానాలు కొంటున్నారు: మోదీపై చింతా ఫైర్
- దేశ సంక్షేమాన్ని మోదీ విస్మరించారు
- తెలివి తక్కువ విధానాలతో దేశం భ్రష్టు పట్టింది
- నోట్ల రద్దు, జీఎస్టీతో ఆర్థిక వ్యవస్థ విచ్ఛిన్నమైంది
రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం ఖాయమని చింతా మోహన్ చెప్పారు. ఏపీలో ఏ పార్టీతో పొత్తు పెట్టుకోవాలనే విషయంపై సంక్రాంతి నాటికి ఏపీసీసీ నిర్ణయం తీసుకుంటుందని అన్నారు. తెలంగాణలో టీడీపీతో పొత్తు పెట్టుకోవడం వల్ల స్థానాలు పెరిగాయని చెప్పారు. రైతుబంధు, 24 గంటల ఉచిత విద్యుత్తు, వృద్ధాప్య పించన్ల పెంపు, ఎంఐఎంతో పొత్తు టీఆర్ఎస్ కు కలసి వచ్చాయని అన్నారు.