Mukesh Ambani: అంబానీ సోదరుల ఒప్పందాన్ని తిరస్కరించిన డాట్... దివాలా దిశగా అనిల్ అంబానీ!

  • ఇప్పటికే అప్పుల పాలైన అనిల్ అంబానీ
  • సోదరుడికి ఆస్తులమ్మాలని నిర్ణయం
  • ఈ డీల్ నిబంధనలకు విరుద్ధమన్న డాట్

ఒకప్పుడు ఇండియాలోని అతిపెద్ద ధనవంతుల్లో ఒకరిగా ఉండి, ఆపై అప్పుల పాలైన అనిల్ అంబానీ మరిన్ని కష్టాల్లో కూరుకునేలా ఉన్నారు. రిలయన్స్ కమ్యూనికేషన్స్ ఆస్తులను తన అన్న ముఖేష్ అంబానీకే విక్రయించి, అప్పులను తీర్చాలన్న ఆయన నిర్ణయాన్ని ప్రభుత్వ టెలికమ్యూనికేషన్ల విభాగం 'డాట్' తిరస్కరించింది. ఆర్ కామ్ ఆస్తులను కొనేందుకు రిలయన్స్‌ జియో ఇన్ఫోకామ్‌ ముందుకురాగా, దీన్ని అనుమతించేందుకు డాట్ అంగీకరించలేదని తెలుస్తోంది.  

ఈ ఒప్పందం భారత స్పెక్ట్రమ్ కొనుగోలు నియమ నిబంధనలకు విరుద్ధంగా ఉందన్నది డాట్ అభిప్రాయం. వాస్తవానికి రుణ తగ్గింపు చర్యల్లో భాగంగా ఏడాది క్రితమే రిలయన్స్‌ జియోతో రూ. 25 వేల కోట్ల ఒప్పందాన్ని అనిల్ అంబానీ కుదుర్చుకున్నారు. తమ వద్ద ఉన్న రేడియో తరంగాలతో పాటు పలు బ్యాంకుల వద్ద తనఖా పెట్టిన ఆస్తులను విక్రయించాలన్నది అనిల్ ఉద్దేశం. దీని ద్వారా తన సంస్థలు దివాలా ప్రక్రియకు వెళ్లకుండా చూసుకోవాలని ఆయన భావించారు. ఇప్పుడది డాట్ నిర్ణయంతో మరింత కష్టంగా మారింది.

More Telugu News