జీఎస్ఎల్వీ-ఎఫ్11 ప్రయోగం విజయవంతమైంది: ఇస్రో చైర్మన్ శివన్
- నెల రోజుల వ్యవధిలో మూడో ప్రయోగమిది
- ఉపగ్రహం విజయవంతంగా కక్ష్యలోకి వెళ్లింది
- ఈ ఉపగ్రహంలో అధునాతన సాంకేతికత ఉపయోగించాం
కాగా, జీశాట్-7ఏ ఉపగ్రహం ద్వారా భారత వాయుసేనకు 70 శాతం, సైన్యానికి 30 శాతం ఉపయుక్తం కానుంది. జీశాట్-ఏతో వైమానిక దళ కమాండ్ సెంటర్లకు కొత్త జవసత్వాలు వచ్చినట్టయింది. కేయూ బ్యాండ్ ద్వారా రాడార్ల కంటే శక్తిమంతమైన సిగ్నళ్లను జీశాట్-7 ఏ అందించనుంది. ప్రధానంగా విమానాలకు ఈ సిగ్నల్స్ ఉపకరించనున్నాయి.