వైసీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే.. కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన జగన్!
- పార్టీలో చేరిన బమ్మిడి నారాయణస్వామి
- వైఎస్ రైతు బాంధవుడని ప్రశంస
- జగన్ ఆయన బాటలోనే వెళుతున్నారని కితాబు
అప్పట్లో ఎన్జీ రంగా నేతృత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా జనతా పార్టీ తరఫున తనతోపాటు 62 మంది ఎమ్మెల్యేలుగా నెగ్గారని నారాయణ స్వామి గుర్తుచేసుకున్నారు. ఆ తర్వాత వీరిలో 61 మంది కాంగ్రెస్ పార్టీలో చేరిపోగా, తాను మాత్రం విలువలకు కట్టుబడి జనతా పార్టీలోనే ఉండిపోయానన్నారు. నారాయణ స్వామి 1978 నుంచి 1983 వరకు టెక్కలి ఎమ్మెల్యేగా పని చేశారు. ఆచార్య ఎన్జీ రంగా, సర్దార్ గౌతు లచ్చన్నలకు ఆయన ముఖ్య అనుచరుడిగా ఉన్నారు.