యాదాద్రిలో చిన్నారుల వ్యభిచారం కేసు.. ప్రత్యేక కోర్టు ఏర్పాటుకు హైకోర్టు ఆదేశాలు!
- హైకోర్టులో చిన్నారుల వ్యభిచారం కేసు
- ప్రత్యేక న్యాయస్థానం అవసరమన్న హైకోర్టు
- కొత్త న్యాయస్థానం ఫ్రెండ్లీ కోర్టుగా ఉంటుందని వ్యాఖ్య
చిన్నారులను వ్యభిచార రొంపిలోకి దించిన వ్యవహారంపై విచారణకు ప్రత్యేక న్యాయస్థానాన్ని ఏర్పాటు చేస్తామని హైకోర్టు తెలిపింది. ఇది చిన్నారులకు ఫ్రెండ్లీ కోర్టుగా ఉంటుందని వెల్లడించింది. ఈ విషయమై చర్యలు తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ తొట్టతిల్ బి.రాధాకృష్ణన్, జస్టిస్ ఎస్.వి.భట్ల ధర్మాసనం ఆదేశించింది. అనంతరం తదుపరి విచారణను వారం రోజుల పాటు వాయిదా వేసింది.