తల్లిదండ్రుల కళ్లముందే ప్రాణాలు కోల్పోయిన టెక్కీ.. రైలు నుంచి దిగుతుండగా దారుణం!
- కర్ణాటకలోని కర్మేలారంలో ఘటన
- తల్లిదండ్రులను రైలు ఎక్కించిన యువకుడు
- ప్రమాదంలో టెక్కీ తండ్రికి తీవ్రగాయాలు
కేరళలోని పాలక్కాడ్ జిల్లా కంజికోడే గ్రామానికి చెందిన విక్రమ్ విజయన్(28) బెంగళూరులోని విప్రో కంపెనీలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు. ఈ నేపథ్యంలో కుమారుడిని చూసేందుకు తల్లిదండ్రులు విజయన్, ఉదయకుమారి బెంగళూరుకు వచ్చారు. కుమారుడితో కొద్దిరోజులు గడిపిన అనంతరం కేరళకు తిరుగుప్రయాణం అయ్యారు. ఈ నేపథ్యంలో కర్మేలారం రైల్వే స్టేషనులో తల్లిదండ్రులను విక్రమ్ రైలు ఎక్కించాడు.
చివరికి రైలు కదలబోతుండగా దిగేందుకు విక్రమ్ ప్రయత్నించాడు. ఈ క్రమంలో కింద పడ్డ విక్రమ్ తీవ్రంగా గాయపడి ప్రాణాలు కోల్పోయాడు. మరోవైపు కుమారుడు పడిపోవడాన్ని గమనించిన విజయన్ తానూ రైలు దిగబోయి తీవ్రంగా గాయపడ్డాడు.