KTR: అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్ల గల్లంతుతో మా అభ్యర్థులకు మెజార్టీ తగ్గింది: కేటీఆర్

  • పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులతో కేటీఆర్ సమావేశం
  • 22 నుంచి నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశాలు
  • పంచాయతీ, పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చ
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్ల గల్లంతుతో తమ అభ్యర్థులకు మెజార్టీ తగ్గిందని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తెలంగాణ భవన్ లో టీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులతో ఆయన సమావేశమయ్యారు. పంచాయతీ, పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు.

ఈ నెల 22 నుంచి 24 వరకు నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశాలు నిర్వహిస్తామని, ఓటర్ల జాబితా సవరణే ఎజెండాగా సమావేశాలు నిర్వహిస్తామని చెప్పారు. కొన్ని చోట్ల ఓటరు కార్డులు ఉండి కూడా ఓట్లు వేయలేకపోయారని, ఓట్ల గల్లంతు విషయమై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని అన్నారు. ఓటరు నమోదుపై కార్యకర్తలకు పలు మార్గదర్శకాలు చేశామని, జనవరి 6 వరకు జరిగే ఓటరు నమోదులో చురుగ్గా పాల్గొనాలని సూచించారు.  
KTR
TRS
telangana bhavan
election commission

More Telugu News