bhanu kiran: వాడి పాపాన వాడే పోతాడు: గంగుల భానుమతి

  • ప్రతీకార కక్ష అనే ఆలోచనే మాకు లేదు
  • డబ్బు కోసమే నా భర్తను భాను కిరణ్ హతమార్చాడు
  • కోట్ల రూపాయల సెటిల్ మెంట్స్ చేశాడు
మద్దెల చెరువు సూరి హత్య కేసులో ప్రధాన నిందితుడు భాను కిరణ్ కు యావజ్జీవ శిక్ష విధిస్తూ ఈరోజు కోర్టు తీర్పు వెలువడిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా సూరి భార్య గంగుల భానుమతి విలేకరులతో మాట్లాడుతూ, భాను కిరణ్ డబ్బు కోసమే తన భర్తను హతమార్చాడని అన్నారు. కోట్ల రూపాయల సెటిల్ మెంట్స్ చేశాడని చెప్పారు.

భాను కిరణ్ తన డబ్బును సినీ నిర్మాతల దగ్గర దాచుకుని ఉంటాడని అభిప్రాయపడింది. సూరి హత్యతో ఆయన వర్గీయులు ప్రతీకార కక్షతో ఉన్నారా? అనే ప్రశ్నకు భానుమతి సమాధానమిస్తూ, ‘చెయ్యాలనుకుంటే ఎప్పుడో చెయ్యొచ్చు కానీ, అలాంటి ఆలోచన మాకు లేదు. వాడి పాపాన వాడే పోతాడు’ అని అన్నారు.
bhanu kiran
maddela cheruvu suri
gangula bhanumati

More Telugu News