revanth reddy: రేవంత్ రెడ్డి అరెస్ట్ పై విచారణ వాయిదా

  • ఈ ఉదయం పిటిషన్ ను విచారించిన హైకోర్టు
  • కౌంటర్ దాఖలు చేసిన రాష్ట్ర ప్రభుత్వం
  • తదుపరి విచారణ 20వ తేదీకి వాయిదా
తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అరెస్ట్ పై దాఖలైన పిటిషన్ పై విచారణను ఈ నెల 20కి హైకోర్టు వాయిదా వేసింది. ఈ ఉదయం కేసు విచారణకు రాగా... ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసింది. ఈ నేపథ్యంలో, వచ్చే గురువారం తమ వాదనలను వినిపిస్తామని పిటిషనర్ తరపు న్యాయవాది హైకోర్టును కోరారు. దీంతో, తదుపరి విచారణను హైకోర్టు 20వ తేదీకి వాయిదా వేసింది. కొడంగల్ లోని నివాసం నుంచి రేవంత్ రెడ్డిని పోలీసులు అర్ధరాత్రి పూట అరెస్ట్ చేసి, తరలించిన సంగతి తెలిసిందే.
revanth reddy
arrest
high court

More Telugu News