mahesh babu: ఈ బిజినెస్ చేయాలనేది నా కల: మహేష్ బాబు

  • మల్టీప్లెక్స్ బిజినెస్ అనేది నా కల
  • ఇప్పుడు నా కల నెరవేరింది
  • సినిమాలు, వ్యాపారాన్ని బ్యాలెన్స్ చేయడంలో ఇబ్బంది లేదు
సూపర్ స్టార్ మహేష్ బాబు తాజాగా 'ఏఎంబీ' పేరుతో మల్టీప్లెక్స్ బిజినెస్ లోకి ప్రవేశించిన సంగతి తెలిసిందే. ఓ సంస్థకు చెందిన ప్రమోషన్స్ కార్యక్రమంలో పాల్గొన్న మహేష్... తన కొత్త బిజినెస్ గురించి మాట్లాడారు. మల్టీప్లెక్స్ బిజినెస్ అనేది తన కల అని చెప్పారు. తన కోరిక ఇప్పుడు నెరవేరిందని అన్నారు. ఏషియన్ ఫిల్మ్స్ సహకారంతో తాను ఈ బిజినెస్ చేస్తున్నట్టు వెల్లడించారు.

తన ప్రథమ ప్రాధాన్యం నటనకేనని... ఈ తర్వాతే బిజినెస్ అని చెప్పారు. సినిమాలు, వ్యాపారాన్ని బ్యాలెన్స్ చేయడంలో తనకు ఎలాంటి ఇబ్బంది లేదని తెలిపారు. మల్టీప్లెక్స్ థియేటర్లలో సినిమాలు చూడటం తనకు ఇష్టమని... ఇప్పుడు సొంత మల్టిప్లెక్స్ ఉండటం తనకు ఎంతో సంతోషాన్ని ఇస్తోందని చెప్పారు.
mahesh babu
multiplex
business
tollywood

More Telugu News