subrahmanian swamy: అఫిడవిట్ ఎవరు తయారు చేశారో మోదీ తెలుసుకోవాలి: సుబ్రహ్మణ్యస్వామి

  • తాను తయారు చేయలేదని అటార్నీ జనరల్ చెబుతున్నారు
  • ఇంకెవరు తయారు చేశారో మోదీ కనుక్కోవాలి
  • ఇంగ్లీషులో మంచి డ్రాఫ్ట్ ను తయారు చేయలేకపోయారు
రాఫెల్ డీల్ కేసులో సుప్రీంకోర్టుకు ఇచ్చిన అఫిడవిట్ ను ఎవరు తయారు చేశారో ప్రధాని మోదీ కనుక్కోవాలని బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి సూచించారు. సుప్రీం తీర్పులో తప్పులు దొర్లాయన్న ఆరోపణల నేపథ్యంలో, తీర్పును పున:సమీక్షించాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైన క్రమంలో స్వామి ఈ అంశంపై స్పందించారు.

అఫిడవిట్ ను తాను తయారు చేయలేదని మీడియాతో మాట్లాడుతూ అటార్నీ జనరల్ చెప్పారని... ఈ నేపథ్యంలో, ఆ పని ఎవరు చేశారనే విషయాన్ని తెలుసుకోవాల్సి ఉందని స్వామి అన్నారు. ఈ అంశంతో ప్రధాని మోదీ ఇబ్బందులకు గురవుతున్నారని... అందుకే అఫిడవిట్ ఎవరు తయారు చేశారనే విషయాన్ని ఆయన తెలుసుకోవాలని చెప్పారు. ఇంగ్లీషులో ఒక మంచి డ్రాఫ్ట్ ను కూడా తయారు చేయలేకపోయారని... కనీసం హిందీలో అయినా సరైన డ్రాఫ్ట్ ను ఇచ్చి ఉండాల్సిందని అన్నారు.
subrahmanian swamy
bjp
rafale
Supreme Court
affidavit
draft
attorney general
modi

More Telugu News